ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్‌పై క్లారిటీ వచ్చేసింది..

ఎన్‌టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్‌పై క్లారిటీ వచ్చేసింది..

తెలుగు చిత్ర ప్రేమికులకు మాస్‌లోనే కొత్త తరహా యాంగిల్ చూపించన ఘనత త్రివిక్రమ్, ఎన్‌టీఆర్‌లకే దక్కుతోంది. అరవింద సమేతా సినిమాతో కొత్త రకం మాస్‌ను అభిమానులకు పరిచయం చేశారు. దాంతో వీరి కాంబోలో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకున్నారు. వారి కోరిక అప్పుడే నెరవేరింది. ఎన్‌టీఆర్, త్రవిక్రమ్ కాంబోలో మరో సినిమా ఉంటుందని అప్పుడే ప్రకటించారు. కానీ అది ఎప్పుడు మొదలవుతుందని క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇటీవల వీరి కాంబోలో రెండో సినిమా పట్టాలెక్కనుందని క్లారిటీ ఇచ్చిన అభిమానులకు తీపికబురు వినిపించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ సెంటిమెంట్ ‘అ’తో ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే పేరును ఫిక్స్ చేశారట. కాన కొన్న రోజుల క్రితం ఈ సినిమాకు పేరు మారిందని. నాయుడు సెంటిమెంట్‌తో దీనికి ‘చౌడప్ప నాయుడు’ అనే పేరు పెడుతున్నారిన వార్తలు వినిపించాయి. అయితే ఒక్కసారి ఫిలిం ఛాంబర్‌లో పేరు నమోదు చేశాక అదే ఫైనల్ అవుతుంది. కానీ ఈ సినిమా టైటిల్‌ సందేహాలు అనేకంగా వచ్చాయి. వీటికి సమాధానం అంటే సినిమాకి మొదటి టైటిల్ ఫిక్స్ అనే చెప్పాలి. కానీ ఇందులో ఎన్‌టీఆర్ పాత్రకు చౌడప్ప నాయుడు అనే పేరు ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాకు మొదటి టైటిల్ ఫిక్స్ అయినట్లే. ఇక ఎన్‌టీఆర్ పాత్ర పేరు కోసం మరి కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.