ఎమ్మార్వో ఎదుటే కొరుక్కున్న వీఆర్వోలు !

ఎమ్మార్వో ఎదుటే కొరుక్కున్న వీఆర్వోలు !

కర్నూలు ఎమ్మార్వో కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్వోలు బాహాబాహీకి దిగారు. తహశిల్దార్ ముందే విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్లు తన్నుకున్నారు. జోహారపురం సుంకేశుల వీఆర్వోల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో కృష్ణదేవరాయ అనే వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి చెవిని కొరికి గాయపర్చాడు. బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, వేణుగోపాల్‌ రెడ్డి తహశిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రైతుల పాస్ బుక్ విషయంలో వేణుగోపాల్ రెడ్డి తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నందువల్లే దాడి చేసినట్లు కృష్ణదేవరాయ చెబుతున్నాడు. వీరిద్దరికి రాజీ కుదిర్చేందుకు రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.