వింతవ్యాధి సాక్షిగా వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ 

వింతవ్యాధి సాక్షిగా వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ 

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంలోని ఏలూరులో వింతవ్యాధి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఏలూరు నుంచి ఈ వ్యాధి భీమడోలు, దెందులూరు మండలాలకు పాకింది.  దెందులూరు మండలంలోని కొమిరేపల్లి గ్రామంలోని 13 మంది ప్రజలు వింతవ్యాధి బారిన పడ్డారు.  ఈ వ్యాధి బారిన పడిన ప్రజలను వెంటనే నెల్లూరుకు తరలించి వైద్యం అందిస్తున్నారు.  స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, వింతవ్యాధి పరిస్థితులను తెలుసుకునేందుకు జనసేన కార్యకర్తలు కొమిరేపల్లి వెళ్లారు.  కొమిరేపల్లికి వచ్చిన జనసేన కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.  ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.