ఏపీ పరిషత్ ఎన్నికలు: తూర్పుగోదావరి జిల్లాలో ఘర్షణ... నలుగురికి గాయాలు 

ఏపీ పరిషత్ ఎన్నికలు: తూర్పుగోదావరి జిల్లాలో ఘర్షణ... నలుగురికి గాయాలు 

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.  ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు మొదలయ్యాయి.  ఉదయం నుంచి ఓటర్లు కొన్ని ప్రాంతాల్లో క్యూలు కడుతున్నారు.  ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఇక ఇదిలా ఉంటె తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని సత్తెమ్మపేటలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  అధికార వైసీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఘర్షణ జరిగింది.  జనసేన నేతలు ఓటర్లకు డబ్బులు పంచేందుకు వచ్చారని, వారిని వైసీపీ నేతలు అడ్డుకునే క్రమంలో ఘర్షణ చోటు చేసుకుందని వైసీపీ నేతలు చెప్తున్నారు.  డబ్బులు పంచేందుకు వచ్చిన జనసేన నేతలను అడ్డుకున్న తమపై జనసేన నేతలు రాళ్లదాడికి దిగారని వైసీపీ ఆరోపిస్తోంది.  ఈ రాళ్లదాడిలో నలుగురు వైసీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి.  గాయపడిన కార్యకర్తలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.