సాక్ష్యంలో హైలెట్ ఇదే 

సాక్ష్యంలో హైలెట్ ఇదే 

తెలుగునాట రిలీజ్ కానున్న క్రేజీ ప్రాజెక్టుల్లో సాక్ష్యం కూడా ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ 14న రిలీజ్ కానుండడంతో శరవేగంగా పోస్ట్ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  ఈ సినిమాను డైరెక్టర్ శ్రీవాస్ పంచభూతాల, కర్మ సాక్ష్యం వంటి డిఫెరెంట్ ఎలెమెంట్స్ తో తెరకెక్కించారు. 

తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి వినిపిస్తున్న వార్తల ప్రకారం..సినిమాలో అత్యధిక బడ్జెట్ కేవలం ఫైనల్ ఎపిసోడ్ కే కేటాయించారట. సినిమాకే కీలకం కావడంతో గ్రాఫిక్స్ ను హైలెవెల్లో ఉపయోగించారని తెలుస్తోంది. ఇదివరకు మన తెలుగు సినిమా తెరపై చూడని విజువల్స్ చూస్తామని నిర్మాతలు నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్ బాగుండడంతో మంచి పాజిటివ్ హైప్ నెలకొంది. సోసియో ఫాంటసీగా సాగనున్న ఈ సినిమాలో జగపతి బాబు, మీనా, శరత్ బాబులు కీలక పాత్రల్లో నటించారు. ఆర్థర్ విల్సన్ సినెమటోగ్రఫీ అందించగా, హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. ఈ ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మించారు.