నిఫ్టి లాభాల్లో ముగిసినా...

నిఫ్టి లాభాల్లో ముగిసినా...

ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా మార్కెట్‌ ఇవాళ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఇవాళ ఉదయం కేవలం 5 పాయింట్ల లాభంతో 11677 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఒకదశలో 11,641కు క్షీణించిన నిఫ్టికి.. అదే స్థాయిలో మద్దతు అందింది. అక్కడి నుంచి లాభనష్టాల్లోకి వస్తూ పోతూ... ఎట్టకేలకు 11,727  పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. క్లోజింగ్‌లో 11,691 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 19 పాయింట్లు పెరిగింది. ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనా.. తరవాత లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ, మెటల్‌ కౌంటర్లలో మినహా ఇతర కౌంటర్లలో పెద్దగా కొనుగోళ్ళ ఆసక్తి రాలేదు. ఇన్ఫోసిస్‌ ఇవాళ భారీగా పెరిగింది. క్లోజింగ్‌ సమయంలో ఒత్తిడికి గురైనా... ఈ షేర్‌ భారీ లాభంతో ముగిసింది. నిఫ్టి ప్రధాన షేర్లలో వేదాంత, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కంపెనీలు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు... ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఎస్‌ బ్యాంక్‌, హిందాల్కో, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా షేర్లు ఉన్నాయి. 

ఇక బీఎస్‌ఈలో టాప్ గెయిన్స్‌గా నిలిచిన సెన్సెక్స్‌ షేర్లు ఇవి.... వీబీఎల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఆసాహి ఇండియా, రెడింగ్టన్‌, డీ మార్ట్‌.
సెన్సెక్స్ ప్రధాన టాప్‌ లూజర్స్‌.... జెట్‌ ఎయిర్‌వేస్‌, జైన్‌ ఇరిగేషన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆర్‌ పవర్‌.