నష్టాలలో ముగిసిన నిఫ్టి

నష్టాలలో ముగిసిన నిఫ్టి

రేపు రంజాన్‌ సెలవు కావడం, ఎల్లుండి ఆర్బీఐ పరపతి విధానం ప్రకటన ఉండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడ్డారు. పెద్దగా పొజిషన్స్‌ తీసుకోకపోవడంతో రోజంతా నిస్తేజంగా ట్రేడింగ్‌ సాగింది. ఉదయం 46 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టి ఒకదశలో స్వల్ప లాభాల్లోకి వచ్చింది. కాని రోజంతా నష్టాల్లోనే ఉంది. ఒకదశలో 12,005కి క్షీణించినా క్లోజింగ్‌లో 12,021 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 67 పాయింట్లు, సెన్సెక్స్‌ 184 పాయింట్లు నష్టంతో ముగిశాయి. క్రూడ్‌ ధరల పతనం ఇంకా ఆగలేదు. అయినా ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి స్థిరంగా ట్రేడైంది. కారణం... షేర్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉండటం. నిఫ్టి ప్రధాన షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా షేర్లు టాప్‌ గెయినర్స్‌గా ముగిశాయి. ఇక నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హీరో మోటోకార్ప్, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్దీస్‌ ల్యాబ్‌, బీపీసీఎల్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ షేర్లలో ఐడీబీఐ, హెరిటేజ్‌ ఫుడ్స్‌, అడ్వాన్స్ ఎంజైమ్‌, వా బాగ్‌, బలరామ్‌ పూర్‌ చినీ టాప్‌ గెయినర్స్‌గా నిలవగా.... వాకంగ్రి, జూబ్లియంట్‌, ఇండియా సిమెంట్‌, దైనిక్‌ భాస్కర్‌, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా ముగిశాయి.