నిస్తేజంగా ముగిసిన నిఫ్టి

నిస్తేజంగా ముగిసిన నిఫ్టి

డెరివేటివ్స్‌ జూన్‌ సిరీస్‌ స్థిరంగా ముగిసింది. సిరీస్‌ చివరి రోజు కావడంతో రోజంతా మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొంది.  ఉదయం 13 పాయింట్ల లాభంతో 11,860 వద్ద ప్రారంభమైన నిఫ్టి ఒకదశలో 11,911 పైన ట్రేడైనా.. తరువాత వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా 11,821కి క్షీణించింది. క్లోజింగ్‌లో కాస్త కోలుకుని 11,841 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 6 పాయింట్లు క్షీణించింది. ఇటీవల బాగా క్షీణించిన ఆటో రంగ షేర్లకు షార్ట్‌ కవరింగ్‌ రూపంలో మద్దతు లభించింది. ఫైనాన్షియల్‌కు ఇవాళ కూడా మద్దతు కొనసాగింది. ఐటీ షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లు జీ 20 దేశాల సమావేశం నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య జరిగే చర్చల గురించి మార్కెట్‌లో టెన్షన్‌ నెలకొంది. నిఫ్టి ప్రధాన షేర్లలో టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌ ఉన్నాయి. 
టాప్‌ లూజర్స్‌గా ముగిసిన షేర్లు... టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, హిందాల్కో
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌... శ్రీరామ్‌ సిటీ, దైనిక్‌ భాస్కర్‌, టీఎన్‌ పీఎల్‌, శ్రేయా ఇన్‌ఫ్రా, హెచ్‌ఈజీ
సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌... కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఐఎఫ్‌సీఐ, పీసీ జ్యువల్లర్స్‌, వొకార్డ్‌ ఫార్మా, జైన్ ఇరిగేషన్‌