భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి

గడచిన కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన షేర్లన్నీ ఇవాళ తమ నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేశాయి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో భారీ హెచ్చుతగ్గులకు లోనైన నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. ఉదయం అంతర్జాతీయ మార్కెట్లన్నీ భారీ లాభాలు గడించినా.. నిఫ్టి 38 పాయింట్ల నష్టంతో 11,653 వద్ద ముగిసింది. తరువాత కోలుకుని లాభాల్లోకి వచ్చింది. మిడ్ సెషన్‌ వరకు హెచ్చు తగ్గులకు లోనైన నిఫ్టి... ఆ తరువాత లాభాల వైపు దూసుకుపోయింది. ఇటీవల వరుసగా షార్ట్‌ చేసిన షేర్ల ధరలు అనూహ్యంగా పెరగడం ప్రారంభం కావడంతో నిఫ్టి పరుగులు తీసింది. షార్ట్‌ కవరింగ్‌ జోరుగా ఉండటంతో చివరి అరగంటలో కూడా ఎలాంటి కరెక్షన్‌ రాలేదు. నిఫ్టి 140 పాయింట్ల లాభంతో 11,831  పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 488 పాయింట్లు పెరిగింది. ముడి చమురు ధరలు ఇవాళ అనూహ్యంగా పెరిగాయి. అమెరికాకు చెందిన ఓ డ్రోన్‌ను తాము కూల్చేశామని ఇరాన్‌ ప్రకటించడంతో  ముడి చమురు ధరలు ఏకంగా 3 శాతం పెరిగాయి.  

ఇవాళ నిప్టి ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌... ఎస్‌ బ్యాంక్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఉన్న షేర్లు ఇవి... యూపీఎల్‌, విప్రో, అదానీ పోర్ట్స్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా
బీఎస్ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లు... జెట్‌ ఎయిర్‌వేస్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ క్యాపిటల్‌, ఆర్‌ పవర్, సుజ్లాన్‌
సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌.... యూపీఎల్‌, మాగ్మా, మన్‌ పసంద్‌, ఇండియా బుల్స్‌ లిమిటెడ్‌, హెచ్‌ఈజీ