సీఎల్పీ అత్యవసర భేటీ.. ఆ ఇద్దరూ గైర్హాజరు

సీఎల్పీ అత్యవసర భేటీ.. ఆ ఇద్దరూ గైర్హాజరు

సీఎల్పీ అత్యవసర భేటీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సహా 15 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు పార్టీని వీడుతున్నామని ప్రకటించారు. మిగిలిన 17మందిలో పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి గైర్హాజరయ్యారు. రోహిత్‌రెడ్డి చెన్నైలో ఉండగా.. ఉపేందర్‌రెడ్డి అనారోగ్య కారణంతో పార్టీకి హాజరుకాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఇక.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకత్వంతోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుంటే జోష్ రావడం లేదని అన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ భేటీ నుంచి వచ్చిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నాయకత్వాన్ని మార్చాలని 
హైకమాండ్‌ను కోరుతున్నానని.. నాయకత్వాన్ని మారిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 8 సీట్లు గెలుచుకుంటామని అన్నారు. తన నియోజకవర్గంలో ప్రధాన నాయకుడు మరణించడంతోనే సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోతున్నానని చెప్పారు.