సీఎం కేసీఆర్ పై మల్లు తీవ్ర విమర్శలు

సీఎం కేసీఆర్ పై మల్లు తీవ్ర విమర్శలు

సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్న దేశానికి ప్రమాదకరమని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం క్విట్ ప్రోకో కిందికి వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై చర్యల కోసం అన్ని వ్యవస్థలను ఆశ్రయిస్తామని అన్నారు. ప్రభుత్వ చర్యలను సభలో, ప్రజల్లో ఎండగతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. పార్టీ మారాలని అనుకునే ప్రజాప్రతినిధులు ముందుగా రాజీనామా చేయాలని సూచించారు. 

'10వ షెడ్యూల్ద్ ఏ సభ్యుడు ఉల్లంఘించినా... స్పీకర్ చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సీఎం... నియంతలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడితే గవర్నర్ చర్యలు తీసుకోవాలి. కానీ గవర్నర్ కూడా స్పందించలేదు. మిషన్ భగీరథలో జరిగిన అవినీతిపై..సాక్ష్యాలతో సహా బయట పెడతాం. అవినీతి చర్యలన్ని లోక్ పాల్ ముందు పెడతాం. త్వరలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తాం. హిట్లర్ లాంటి నియంత చివరికి జీవితం ఎలా ముగించాడో సీఎం తెలుసుకుంటే మంచిది. ఓటేసిన ఓటర్లు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యే లపై కేసులు పెట్టబోతున్నారు' అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.