రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన భట్టి

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన భట్టి

కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనేది ఒక భ్రమనేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని పేర్కొన్నారు. ఈ అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చించి దానిపై తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. 

శనివారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని బాంబు పేల్చారు కోమటిరెడ్డి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి రాష్ట్ర నాయకత్వమే కారణమని విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీడీపీతో పొత్తుపెట్టుకొని కొంప ముంచారని విమర్శలు గుప్పించారు.