భట్టి విక్రమార్క దీక్ష భగ్నం

భట్టి విక్రమార్క దీక్ష భగ్నం

హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్రం చేశారు. సోమవారం ఉదయం దీక్ష చేస్తున్న ఆయనను అరెస్ట్ చేసి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఆయన ఈనెల 8 నుంచి ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరానికి పలువురు కాంగ్రెస్ నాయకులు, ఇతర ముఖ్యులు వచ్చి భట్టి విక్రమార్కకు సంఘీభావం ప్రకటించారు.