అందుకే ఎన్నికలను బహిష్కరించాం: భట్టి

అందుకే ఎన్నికలను బహిష్కరించాం: భట్టి

ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది భయపడి కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం గాందీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలపై గట్టిగా యుద్ధం చేయటానికే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాం. అంతేకాని మిగిలిన ఎమ్మెల్యే లను కాపాడుకోవడానికి ఎన్నికలను బహిష్కారించలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ప్రజాస్వామ్యాకి ప్రమాదమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సభాపతికి పిటిషన్ ఇచ్చామని.. అక్కడి నుంచి స్పందన రాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చే దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవని భట్టి విక్రమార్క విమర్శించారు.