ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మావాళ్లు లొంగరు : భట్టి

ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మావాళ్లు లొంగరు : భట్టి

అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తమ ఎమ్మెల్యేలు లొంగరని,   కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. సిఎల్పీ లీడర్ బాధ్యతలు అప్పగించినందుకు రాహుల్ గాంధికి,రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారాయన. సమిష్టిగా తాను ముందుకెళతానని, అసెంబ్లీలో ప్రజల గొంతుకై పనిచేస్తానని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. గవర్నర్‌ నరసింహన్ ప్రసంగంలో కొత్తదనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ ,నిరుద్యోగ భృతిపై ఊసేలేదని, నిరుద్యోగుల గురించి వాస్తవాలు చెబితే నమ్మేవాళ్లమని భట్టి విక్రమార్క అన్నారు.