పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లోకి..

పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లోకి..

పార్టీ ఫిరాయింపులపై జనంలోకి వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో పార్టీ మారిన నేతల నియోజకవర్గాల్లో యాత్రకు సిద్ధమయ్యారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్క.. ఇవాళ్టి నుంచి యాత్రను ప్రారంభిస్తారు. భద్రాచలంలో రాములోరి సన్నిధిలో పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి యాత్రకు శ్రీకారం చుడతారు. ముందుగా పినపాక నియోజకవర్గం నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర మొదలు కాబోతోంది. స్పీకర్ దగ్గర నుంచి గవర్నర్ వరకు ఎవరూ స్పందించలేదు కాబట్టే.. వీధి పోరాటు చేయాల్సి వస్తోందని ప్రజలకు చెప్పనుంది కాంగ్రెస్ పార్టీ. కాగా, అసెంబ్లీ ఎన్నిల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది.. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి 11 మంది  ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. మరో ఇద్దరు  ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని... సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలనే ప్రయత్నాలు జరగుతున్నాయి. దీంతో అధికారపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది.