నాలుగో శ్వేతపత్రంలో ఏముందంటే..

నాలుగో శ్వేతపత్రంలో ఏముందంటే..

దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి రూ. 50 వేలు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతిపై ఆయన ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 10 శాతం వడ్డీ చెల్లిస్తూ 4 విడతలుగా రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 62 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో 17 పూర్తయ్యాయని, మరో ఆరు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమను పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తెచ్చామన్నారు. కృష్ణా డెల్టాకు రావాల్సిన జలాలను రాయలసీమకు తరలించినట్లు చెప్పారు. అభివృద్ధికి వ్యవసాయం పునాది అని అన్నారు. కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయంపై ఆధారపడిన జనాభాలోని 65 శాతం ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలన్నారు. రుణమాఫీకి సహకరించమని కోరినా కేంద్రం కనికరించలేదని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ. 16 వేల కోట్లలో కోత విధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.