దేవెగౌడ, కుమారస్వామితో బాబు భేటీ...

దేవెగౌడ, కుమారస్వామితో బాబు భేటీ...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెంగళూరు చేరుకున్నారు... బెంగళూరులోని పద్మనాభనగర్‌లో ఉన్న దేవెగౌడ నివాసానికి చేరుకున్న చంద్రబాబు బృందానికి దేవెగౌడ్, కుమారస్వామి ఆహ్వానం పలికారు. అనంతరం చంద్రబాబు బృందం, దేవెగౌడ, కుమరస్వామి భేటీ ప్రారంభమైంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస భేటీలు కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... బీజేపీయేతర శక్తులను కూడగట్టే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. మరో వైపు తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించడంపై కుమరస్వామిని చంద్రబాబు అభినందించినట్టు తెలుస్తోంది. ఇక త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సైతం ఆహ్వానిస్తారని సమాచారం... అందుకే తన వెంటనే టి.టీడీపీ నేతలను కూడా చంద్రబాబు తీసుకెళ్లారనే చర్చ సాగుతోంది.