తొలిసారి గంగమ్మకు చంద్రబాబు ప్రత్యేక పూజలు..

తొలిసారి గంగమ్మకు చంద్రబాబు ప్రత్యేక పూజలు..

ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో జరుగుతోన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో పాల్గొన్నారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమ్మవారికి విశ్వరూప దర్శన పూజలు నిర్వహించారు. గంగమ్మకు పట్టు వస్త్రాలు అందించి విశ్వరూప దర్శనం చేసుకొన్న చంద్రబాబు దంపతులు.. తొలిసారిగా గంగమ్మ జాతరకు హాజరై మొక్కు తీర్చుకున్నారు. అనంతరం బెంగుళూరు మీదుగా విజయవాడకు చేరుకోనున్నారు చంద్రబాబు.