ముస్లింలకు చంద్రబాబు పెద్దపీట

ముస్లింలకు చంద్రబాబు పెద్దపీట

మారిన రాజకీయ పరిస్థితులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... కేబినెట్, ఇతర పదవుల్లో ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు ముస్లింలకే పూర్తి స్థాయి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు... మంత్రి, మండలి ఛైర్మన్, విప్ పదవులను ముస్లింలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిగా ఫరూక్, మండలి ఛైర్మన్‌గా షరీఫ్, ప్రభుత్వ విప్‌గా చాంద్ పాషాను నియమించనున్నారు. ఈ పదవులు ఇస్తున్నట్టు వారికే తెలిపారు చంద్రబాబు. ఇక అనంతపుంర విప్‌ల జిల్లాగా మారిపోయింది...  శాసన మండలి, అసెంబ్లీ చీఫ్ విప్ పదవులు... రెండు విప్ పదవులను దక్కించుకుంది అనంతపురం. విశాఖ, కర్నూలు జిల్లాల్లో ఇకపై ముగ్గురు మంత్రులు ఉండనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు మండలి ఛైర్మన్ పదవి దక్కనుంది. ఇప్పటి వరకు మండలి చైరర్మన్‌ పదవిలో ముస్లిం ఉండగా... మళ్లీ ముస్లిం ఎమ్మెల్సీతోనే ఆ పదవిని భర్తీ చేయనున్నారు చంద్రబాబు.