ఆర్టీఐ కమిషనర్ల ఎంపికపై సందిగ్ధత!

ఆర్టీఐ కమిషనర్ల ఎంపికపై సందిగ్ధత!

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ చీఫ్ కమిషనర్, ముగ్గురు కమిషనర్ల ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది... ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది ఏపీ సర్కార్, అయితే ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఆర్థిక మంత్రి యనమలతో భేటీ కానున్న చంద్రబాబు... ఆర్టీఐ కమిషన్ల ఎంపికపై చర్చించనున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హాజరు కాకపోవడంతో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక జాప్యం అవుతోందని ప్రభుత్వం ఆరోపిస్తుండగా... ఈ రోజు భేటీలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపికపై తుది నిర్ణయం ఉంటుందా..? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష నేత రాకుంటే ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక ఏ విధంగా జరపాలన్న అంశంపై న్యాయ సలహా తీసుకోనుంది ఏపీ సర్కార్.