కుమారస్వామి కీలక నిర్ణయం..!

కుమారస్వామి కీలక నిర్ణయం..!

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్-జేడీ(ఎస్‌) సంకీర్ణ సర్కార్‌ను నడపడంలో తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న కుమారస్వామి... కాసేపట్లో గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉందని జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం.. రెబల్ ఎమ్మెల్యేలు దిగిరాకపోవడంతో.. విశ్వాసపరీక్షలో ఓడిపోడం ఖాయమని భావిస్తున్న కుమారస్వామి.. బలపరీక్షకు ముందే రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై చర్చ జరుగుతోంది. దీనిపై మాట్లాడేందుకు ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం ఇచ్చారు స్పీకర్ రమేష్ కుమార్. పాలక, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలతో చర్చ సుదీర్ఘంగా సాగుతోంది. ఇక, రెబల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేయొచ్చని స్పీకర్ సూచించారు. వారు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. విప్ జారీ చేసే అంశంతో పాటు ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయంపై రేపు సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి.