ధోనీ కోసం ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించాలి..బీసీసీఐకి సీఎం వినతి 

ధోనీ కోసం ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించాలి..బీసీసీఐకి సీఎం వినతి 

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు గత రాత్రి ప్రకటించాడు. ధోని నిర్ణయంతో క్రీడా లోకం ఒక్కసారిగా షాక్ కు గురైంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ ఎంతోమంది ధోనీ రిటైర్మెంట్‌పై స్పందిస్తున్నారు. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ ద్వారా ధోనీ రిటైర్మెంట్ పై బీసీసీఐకి ఒక విన‌తి చేశారు. భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలను అందించిన ధోని కోసం, మరియు అతని ఫ్యాన్స్ కోసం ఒక్క ఫేర్ వెల్ మ్యాచ్‌ని నిర్వహించాలని ఆయన బీసీసీఐని కోరారు. ఈ మ్యాచ్ కి రాంచీ స్టేడియం ఆతిధ్యం ఇస్తుందని ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని అభిమానలందరి కోసం ఈ మ్యాచ్ ని పెట్టాలని అయన అన్నారు.. సీఎం సోరెన్ అభ్యర్థనపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సిందే..