వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. ఇవాళే శ్రీకారం..

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. ఇవాళే శ్రీకారం..

హామీలపై అమలుపై దృష్టిపెట్టిన సీఎం వైఎస్ జగన్.. వరుసగా కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ వస్తున్నారు... వైద్య ఆరోగ్య రంగంలోకి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఇవాళ మరో అడుగు ముందుకు వేయనుంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టును ఇవాళ ముఖ్యమంత్రి ఏలూరులో ప్రారంభించనున్నారు.. మొత్తం 2059 వ్యాధులకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందించేలా పైలెట్ ప్రాజెక్టును రూపొందించారు. కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను ముఖ్యమంత్రి స్వయంగా పంపిణీ చేస్తారు. ప్రాజెక్టును మూడు నెలల పాటు అధ్యయనం చేసి...ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.