జగన్ కీలక నిర్ణయం.. ఇసుక విషయంలో మరింత కఠినంగా..!

జగన్ కీలక నిర్ణయం.. ఇసుక విషయంలో మరింత కఠినంగా..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత తీవ్రచర్చగా మారింది. అయితే.. ఇసుక అక్రమ రవాణాకు పటిష్ట చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్.. ఇసుక రవాణాలో ఎవరైనా అవినీతికి పాల్పడితే.. ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం పలు సూచనలు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా.. నిందితులకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించేలా ఇదివరకే మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.