బీఏసీలో అచ్చెన్నపై సీఎం జగన్ సెటైర్లు..
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం ఆసక్తికరంగా సాగింది. ఈ బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చురకలు అంటించారు. అంతేకాదు బీఏసీలో అచ్చెన్నపై పలు మార్లు సీఎం జగన్ సెటైర్లు కూడా వేశారు. సభ ఆలస్యంపై ప్రశ్నించారు అచ్చెన్న.... గౌరవ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నందుకే ఆలస్యంగా ప్రారంభించామని సీఎం జగన్ బదులిచ్చారు. అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ సీఎం జగన్ కామెంట్ చేశారు. మమ్మల్ని టీవీల్లో చూపించడం లేదన్న అచ్చెన్నాయుడు... అరడుగుల ఆజానుబాహుడు కనిపించపోవడమేంటని సీఎం జగన్ సెటైర్ వేశారు. ఎస్సీ, ఎస్టీ దాడులపై చర్చ జరగాలన్న అచ్చెన్న.. దీనికి బదులుగా వైసీపీ ఎంపీ సురేష్ పై టీడీపీ చేసిన దాడి పైనేనా అని ప్రశ్నించారు సీఎం జగన్. కాగా.. అసెంబ్లీకి హాజరయ్యేందుకు టీడీపీ నేతలు ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అసెంబ్లీ వద్ద చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధర్నా నిర్వహించారు. నీటిలో తడిసిన వరి కంకులతో చంద్రబాబు నాయుడు నిరసన చేపట్టారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)