హైదరాబాద్‌లో ఇవి మినహా ఇక అన్నీ ఓపెన్..

హైదరాబాద్‌లో ఇవి మినహా ఇక అన్నీ ఓపెన్..

కరోనా కట్టడికి మొదట లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసిన ప్రభుత్వం.. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోన్న సమయంలో క్రమంగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చింది.. ఇప్పటికే చాలా వరకు మినహాయింపుల పరిధిలోకి వచ్చినా... తాజాగా మిగతా వాటికి కూడా మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్... ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో గురువారం నుంచి షాపింగ్‌ మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించారు అధికారులు.. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమ్మికూడే ప్రమాదం ఏర్పడుతోంది.. దీంతో.. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది మాత్రమే పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది సర్కార్... అయితే, షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం కోరింది.. భౌతికదూరాన్ని పాటిస్తూ.. మస్క్‌ను ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది సర్కార్.