తెలంగాణ సీఎం బాలకృష్ణను పక్కన పెట్టారా ..?

తెలంగాణ సీఎం బాలకృష్ణను పక్కన పెట్టారా ..?

సినిమా షూటింగ్స్ కు అనుమతి కోరుతూ సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి నందమూరి బాలకృష్ణ ను పిలవకపోవడం పై ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. "చర్చలు జరుపుతున్నారని నాకు తెలియదు. నన్ను ఎవ్వరూ పిలవలేదు , నేను కూడా మీడియాలో చూసి తెలుసుకున్న" అని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలతో టాలీవుడ్ లో వివాదం రేగింది. నిర్మాత సి కళ్యాణ్ స్పందిస్తూ ఎవరు అవసరం అయితే వల్లనే పిలుస్తాం అని అనడం. ఆ తరువాత బాలకృష్ణ  'మీటింగ్స్ పెట్టుకొని భూములు పంచుకుంటున్నారని' వ్యాఖ్యానించారు. దాంతో ఈ వివాదం కాస్త ముదిరింది. అటు నాగబాబు స్పందిస్తూ 'మీరు కింగ్ ఏమి కాదు ఆఫ్టరాల్ యాక్టర్ అంతే' అంటూ బాలకృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఈ రోజు మరో సారి చిరంజీవి ఇంట్లో భేటీ అయిన సినిమా పెద్దలు బాలకృష్ణ వ్యాఖ్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆరోజు మీటింగ్ కు చిరంజీవిని , నాగార్జునను పిలవమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని సి కళ్యాణ్  అన్నారు.  దాంతో మరో కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా అభిమానుల్లో ,ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ వాడు కావడం , పైగా ఆంధ్ర ఎమ్మెల్యే కావడంతో కేసీఆర్ బాలయ్యను పక్కన పెట్టారని అంటున్నారు. చంద్రబాబు పేరు చెప్తేనే కేసీఆర్ చిందులు తొక్కుతారని అందరికి తెలుసు... బాలకృష్ణ ఆయన పార్టీకి చెందినవాడు కావడంతోనే  ఆయనను చర్చలకు పిలవలేదని సోషల్ మీడియా వేదికగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇక బాలకృష్ణ అభిమానులు కేసీఆర్ తీరు పై మండిపడుతున్నారు. సినిమాల విషయంలో రాజకీయా విభేదాలు చూపడం సరికాదని అంటున్నారు . బాలకృష్ణ ఆవేశపరుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతాడు అంటూ నిర్మాతలు , నటులు మాట్లాడటం పైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈవివాదం ఇంతటితో సద్దుమణుగుతుందా..? లేదా..? అన్నది చూడాలి.