చింతమడకలో కేసీఆర్.. బంజారాహిల్స్‌లో కేటీఆర్..

చింతమడకలో కేసీఆర్.. బంజారాహిల్స్‌లో కేటీఆర్..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో జరుగుతోన్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్‌ వెంట మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ఉన్నారు. ఇక మరోవైపు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆయన భార్య శైలిమ హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో ఓటు వేశారు కేటీఆర్ దంపతులు.