అసెంబ్లీలో కేసిఆర్, భట్టి సంవాదం

అసెంబ్లీలో కేసిఆర్, భట్టి సంవాదం

అసెంబ్లీలో ఓటాన్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా సిఎం కేసిఆర్, సిఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క మధ్య వాడివేడి చర్చ జరిగింది.  అంకెల గారడీతో సభను తప్పుదొవ పట్టించొద్దని మల్లు భట్టి విక్రమార్క సభలో సిఎం కేసిఆర్ కు సూచించారు. ఏమి లెక్కలు చెబుతున్నారో అర్ధం కావడం లేదని, మీరిచ్చిన బుక్స్ లో అంశాలే తప్ప, కాకి లెక్కలు చెప్పడం లేదని భట్టి విక్రమార్క  విమర్శించారు. దాంతో చర్చలో జోక్యం చేసుకున్న సిఎం కేసిఆర్ మీ హాయాంలో చేసిన లెక్కలు కూడా ఉన్నాయి.. తీయమంటారా అని నిలదీసారు. సిఎం సమాధానానికి భట్టి విక్రమార్క అభ్యంతరం తెలుపుతూ మీరు అధికారంలోకి వచ్చి ఆరేళ్లు.. ఇంకా ఉమ్మడి రాష్ట్రం గురించి ఎందుకని ఎదురు తిరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే కదా ఉద్యమం చేసారు. మేము బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చిందని భట్టి బదులిచ్చారు. మళ్లీ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంకెలు చెప్తామంటే ఎలా అని సిఎం కేసిఆర్ పై ఎదురుదాడి చేసారు. దబాయించి మాట్లాడితే ఎలా మీరు ఇచ్చిన లెక్కలేనని భట్టి సభలో సీరియస్ గా మాట్లాడారు. చర్చ మధ్యలో జోక్యం చేసుకున్న సిఎం కేసీఆర్.. దబాయించారు అనే పదాన్ని విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాము వింటూ కూర్చొమని నిండు సభలో స్పష్టం చేసారు.