నేడు నిజామాబాదులో కేసీఆర్ ప్రచారం

నేడు నిజామాబాదులో కేసీఆర్ ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. ప్రచారంలో భాగాంగా ఈ రోజు టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, కేసీఆర్ కూతురు ఎంపీ కవితకి మద్దతుగా సీఎం ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ చేరుకొని సభలో పాల్గొంటారు. ఈ సభలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది?.

మరోవైపు సభ జరగనున్న నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే నిజామాబాద్ నగరం మొత్తం  గులాబీ మయంగా మారింది. ఈ సభకు వేలాది మంది తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.