కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దు
భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం అక్కడ సీఎం సభ జరగాల్సి ఉంది. అయితే గత రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో హెలికాప్టర్ వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. మార్గమధ్యంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో అనుమతి నిరాకరించినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హుజూర్నగర్ సభను రద్దు చేసినట్లు తెరాస ప్రకటించింది. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి తడుస్తూనే ఇళ్ళకి వెళ్లిపోతున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)