కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆంధ్ర పెత్తనం...

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆంధ్ర పెత్తనం...

మళ్లీ మనకు ఆంధ్ర నేతల పెత్తనం అవసరం లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ టీఆర్ఎస్ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేస్తే ఆంధ్ర పెత్తనం వస్తుందని ఆరోపించారు. సంక్షేమంలో ఇండియాలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ రాష్ట్రం ఉందన్న ఆయన... ప్రజలు ఊహించని పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్రం తెలంగాణే అన్నారు. రాష్ట్రంలో పెరిగిన సంపద ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం జరిగిందని వెల్లడించారు. శ్రీరాంసాగర్ వరద కాలువ పథకం పునర్జీవ కోసం వెయ్యి కోట్లు మంజూరు చేశావని తెలిపిన కేసీఆర్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తే రెండు తరాల వరకు గుర్తుండే విధంగా నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. ఆర్మూర్ రైతులు పండించే పసుపు పంటను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్... గతంలో తెలంగాణ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ముందు ఉన్నారు.. ఎప్పుడు మీరు ప్రభుత్వంతో ఉండాలని కోరారు. ఇక మీ ఆదరణ చూస్తే జిల్లాలో తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు టీఆర్‌ఎస్‌కు దక్కడం ఖాయమనిపిస్తోందన్నారు కేసీఆర్.