కాళేశ్వరం టూర్‌: రాంపూర్ పంప్‌హౌస్‌ పరిశీలించిన కేసీఆర్

కాళేశ్వరం టూర్‌: రాంపూర్ పంప్‌హౌస్‌ పరిశీలించిన కేసీఆర్

తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... దీనిలో భాగంగా ఇవాళ ఉదయమే రాంపూర్ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతోంది... టార్గెట్ ప్రకారం పనులు జరుగుతున్నాయా? లేదా? అన్ని విషయాలపై స్వయంగా ఆరా తీస్తున్నారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి.. మేడిగడ్డ బ్యారేజ్‌కు బయల్దేరతారు సీఎం కేసీఆర్.. ప్రాజెక్టు నిర్మాణాలపై పూర్తి సమీక్ష తర్వాత హైదరాబాద్‌ చేరుకుంటారు. 20 రోజుల క్రితమే మేడిగడ్డతో పాటు కన్నేపల్లి పంప్‌హౌస్, తెలంగాణ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత కీలకమైంది కావడంతో..  స్వయంగా మరోసారి పనులను పరిశీలిస్తారు కేసీఆర్. అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ గేట్ల బిగింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.