19న కాళేశ్వరానికి సీఎం కేసీఆర్..

19న కాళేశ్వరానికి సీఎం కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ నెల 18న రామగుండంలో, 19న కాళేశ్వరంలో పర్యటించనున్నారు. 18న రామగుండంలో ఉన్న 1600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్‌ను సందర్శిస్తారు. అక్కడే ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 19న ఉదయం కాళేశ్వరం దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కొనసాగుతున్న పనుల్ని సీఎం పరిశీలిస్తారు.