దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో.. కేసీఆర్ కీలక ప్రకటన !

దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో.. కేసీఆర్ కీలక ప్రకటన !

గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతీ ఇళ్ల వివరాలు ఆన్ లైన్ లో నమోదు కావాలని అధికారుల్ని ఆదేశించారు  సీఎం కేసీఆర్.  ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్వవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు.  వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్నవారికి మెరూన్ కలర్ పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీ చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.   ఇకనుంచి ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం  సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నూతన రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు రక్షణ లభిస్తుందని అన్నారు. ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలు ఆశించే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. భూవివాదాలు, ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించేందుకు ఈ పాస్‌బుక్‌ ఉపయోగపడుతుందన్నారు. ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం పాస్‌ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రతి ఇంటికీ నంబర్‌ కేటాయించి పన్ను వసూలు చేయాలన్నారు కేసీఆర్. నాలా బదలాయింపు చేయాలని అధికారులకు సూచించారు. మార్పులు చేర్పుల్లో భాగంగా ధరణి పోర్టల్‌ కాస్త ఆలస్యమైన పర్వాలేదన్నారు. ధరణి పోర్టల్‌ ప్రారంభమైన తర్వాతే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉంటుందన్నారు. దేవాదాయ, వక్ఫ్‌, ఎఫ్‌టీఎల్‌, నాలా, యూఎల్‌సీ పరిధిలో ఇళ్లకు మ్యుటేషన్‌ వర్తించదని తెలిపారు.  భవిష్యత్తులో ఆస్తుల నమోదు, క్రమబద్ధీకరణ, ఉచిత నాలా కన్వర్షన్‌ ఉండదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ జీవోలు, సర్క్యులర్లు తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేయాలని సీఎం ..అధికారుల్ని ఆదేశించారు. ప్రజలకు సమాచారం సులుభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  ఆస్తులన్నింటిని ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్‌లైన్‌లోమ్యూటేషన్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. రాష్ట్రంలో ఇకపై ఏ తరహా రిజిస్ట్రేషన్ అయినా ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతుందని సీఎం తెలిపారు.