కొత్త సచివాలయానికి కేసీఆర్ శంకుస్థాపన

కొత్త సచివాలయానికి కేసీఆర్ శంకుస్థాపన

కొత్తగా నిర్మించనున్న తెలంగాణ సచివాలయానికి శంకుస్థాపన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ప్రస్తుత సచివాలయం డి-బ్లాక్‌ వెనుకభాగంలోని తోటలో సెక్రటేరియట్ కొత్త భవనానికి భూమిపూజ నిర్వహించారు కేసీఆర్. 30 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయం నిర్మించనున్నారు. దీని కోసం రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఘనంగా జరిగిన ఈ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్లు, ముఖ్య నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక, ఇప్పుడున్న సచివాలయ బ్లాక్‌ల కూల్చివేతపై త్వరలోనే మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది.