అసెంబ్లీ భవనాలకు కేసీఆర్ భూమి పూజ..

అసెంబ్లీ భవనాలకు కేసీఆర్ భూమి పూజ..

ఎర్రమంజిల్‌లో కొత్తగా నిర్మించనున్న తెలంగాణ అసెంబ్లీ భవనాల సముదాయాలకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... మొదట సచివాలయంలో నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన సీఎం కేసీఆర్... అనంతరం ఎర్రమంజిల్ వెళ్లి అసెంబ్లీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాత అసెంబ్లీ నమూనాలోనే కొత్త అసెంబ్లీని నిర్మించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, టీఆర్ఎస్ నేతలు, ఉన్నతాధికారులకు పాల్గొన్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన నేతలకు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో భోజనాలు ఏర్పాటు చేశారు.