తమిళనాడుకు బయలుదేరిన సీఎం కేసీఆర్

తమిళనాడుకు బయలుదేరిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుచ్చికి పయనమయ్యారు. తిరుచ్చి నుంచి కేసీఆర్‌ ఆదివారం శ్రీరంగం వెళ్లనున్నారు. అక్కడ శ్రీరంగనాథ స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం చెన్నై వెళ్లి డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో ఆయన నివాసంలో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత తదితర అంశాలపై కేసీఆర్.. స్టాలిన్‌తో చర్చించనున్నట్లు సమాచారం.