'కరీంనగర్‌పై కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువ'

'కరీంనగర్‌పై కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువ'

కరీంనగర్ జిల్లా సైదాపూర్ లో ఎంపీ వినోద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తి కేసీఆర్‌ అని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఏం అభివృద్ధి చేశాయి.. కాళేశ్వరం, గౌరవెళ్లి ప్రాజెక్టులు నిర్మిస్తే కరీంనగర్ ప్రాంతం పచ్చగా ఉంటది. కరీంనగర్‌పై కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువ అని ఈటల పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి పెన్షన్లు రెట్టింపు చేస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అందజేస్తాం. వచ్చే సంవత్సరం నుంచి ఎస్సీలకు వారి స్థలాల్లో ఇల్లు కట్టిచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా ఇంటిఇంటికి 50 వేల నుంచి లక్షా 50 వేల వరకు అందజేస్తాం అని ఈటల రాజేందర్ తెలిపారు.