గవర్నర్ తో కేసీఆర్ భేటీ

గవర్నర్ తో కేసీఆర్ భేటీ

హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై మాట్లాడినట్లు తెలుస్తోంది.