గవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్

గవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన హరితహారం, కంటి వెలుగు కార్యక్రమాల గురించి వివరించారు. ఆగ‌స్టు 15న కంటివెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనాల‌ని సీఎం విజ్ఞప్తి చేశారు. అంతకుముందు  ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణన్‌ను ఆయ‌న నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు.