దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం

దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిశారు. ఈనెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ముంబయికి బయలుదేరిన సీఎం కేసీఆర్ నేరుగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో బేటీ అయిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ముంబయికి వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.