పోచారం తల్లికి సీఎం కేసీఆర్ నివాళి

పోచారం తల్లికి సీఎం కేసీఆర్ నివాళి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. మంగళవారం రాత్రి స్పీకర్ తల్లి పాపవ్వ మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం సీఎంతో పాటు సీఎస్ ఎస్ కే జోషి, నిజామాబాద్ ఎంపీ కవిత, మాజీ స్పీకర్ మధుసుధనాచారి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి పోచారం స్వగ్రామమైన పోచారం చేరుకుని స్పీకర్ తల్లి పాపవ్వ చిత్ర పటానికి కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.