స్పీకర్ తల్లి చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి

 స్పీకర్ తల్లి చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తల్లి స్వర్గీయ పరిగే పాపవ్మ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. శనివారం ఆమె ద్వాదశ దినకర్మ సందర్భంగా కేసీఆర్ బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి వచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి పాపవ్వ చిత్రపటానికి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహముద్‌ అలీ, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎంపీ వినోద్‌, రాజ్యసభ సభ్యులు కేశవరావు, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ నెల 5వ తేదీన పాపవ్వ కన్నుమూసిన సంగతి తెలిసిందే.