చిత్రకారుడు సూర్య ప్రకాష్‌ మృతికి కేసీఆర్ సంతాపం..

చిత్రకారుడు సూర్య ప్రకాష్‌ మృతికి కేసీఆర్ సంతాపం..

ప్రముఖ చిత్రకారుడు సూర్య ప్రకాష్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన చిత్రకారుడిగా సూర్యప్రకాష్‌ చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. సూర్య ప్రకాష్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్. కాగా, 78 ఏళ్ల సూర్యప్రకాష్‌ ఇవాళ కన్నుమూశారు. ఖమ్మం జిల్లా మధిరలో జన్మించిన ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సీసీఎంబీకి రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. జేఎన్‌టీయూ కాలేజీలో ఫైన్‌ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్టర్ కోర్సులో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న సూర్యప్రకాష్‌.. 1961- 1964 వరకు ఏపీ సమాచార శాఖలో ఉద్యోగం చేశారు. సీఎం కేసీఆర్‌తో ప్రముఖులు సూర్యప్రకాష్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.