శంషాబాద్ లో ఘటన మీద కేసీఆర్ ఆవేదన

శంషాబాద్ లో ఘటన మీద కేసీఆర్ ఆవేదన

శంషాబాద్ లో వైద్యురాలిపై జరిగిన ఘటన అమానుషమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయని రాత్రివేళల్లో మహిళలకు డ్యూటీలు వేయొద్దన్నారు. రాత్రి 7.30 నుంచి 8.30 లోపు మహిళా ఉద్యోగులకు విధులు ముగించాలన్నారు. తెలంగాణలో జరిగిన ఘటనపై కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య కేసును అత్యంత వేగంగా విచారించాలని కేసీఆర్ అన్నారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.