ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ వరాలు

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ వరాలు

ప్రగతి భవన్‌లో ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే 52 రోజుల సమ్మె కాలానికి జీతం చెల్లిస్తామని ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సెప్టెంబర్‌ నెల జీతం రేపే చెల్లించాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశించారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం అన్నారు. మహిళల కోసం డిపోల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. సంస్థ మనుగడకు కష్టపడి పని చేయాలని సీఎం కార్మికులకు సూచించారు. బాగా పని చేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తే సింగరేణి మాదిరిగ బోనస్‌ ఇస్తామని పేర్కొన్నారు. బస్సుల్లో ప్రయాణికులు టికెట్‌ తీసుకోకపోతే ఇప్పటి వరకు కండక్టర్‌కు విధిస్తున్న జరిమానాను ఇకపై ప్రయాణికులకే విధించాలని కూడా కేసీఆర్‌ నిర్ణయించారు.