ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త..

ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త..

పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌  గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. పదోన్నతుల కల్పనకు ఉద్యోగుల కనీస సర్వీసు సమయాన్ని ప్రభుత్వం కుదించింది. కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలోని వివిధ శాఖలు, కేటగిరీల్లో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఇటీవల సీఎం ఆదేశించారు. కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ సైతం ఈ నెల 5న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. సోమవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పదోన్నతుల దస్త్రంపై సీఎం సంతకం చేయడంతో అర్హులైన ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా పదోన్నతులు లభించనున్నాయి.