నేడు ధరణి పోర్టల్ ప్రారంభం... 

నేడు ధరణి పోర్టల్ ప్రారంభం... 

తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది.  ఈరోజు నుంచి ఈ పోర్టల్ అందుబాటులోకి రాబోతున్నది.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మాడు చింతలపల్లిలో ప్రారంభించబోతున్నారు.  ఈ ధరణి పోర్టల్ ద్వారా తహశీల్దార్   కార్యాలయంలోనే   రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి.  ఈ సేవలు   అందుబాటులోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ పేపర్లు అవసరం లేకుండా డిజిటల్ రూపంలోనే అమ్మకాలు కొనుగోలు జరుగుతుంది.  ఒకే భూమిని అనేక మందికి అమ్మెందుకు అవకాశం ఉండదు.  ఆధార్, ఓటీపీ ఆధారంగా అమ్మకం జరుగుతుంది. ఇక అక్రమాలను చోటు ఉండదని ప్రభుత్వం చెప్తున్నది.